Elections: ప్రారంభమైన ఐదో దశ పోలింగ్‌.. బరిలో రాహుల్, సోనియా, రాజ్‌నాథ్, స్మృతి..!

  • 51 నియోజకవర్గాల్లో ప్రారంభమైన పోలింగ్
  • బరిలో 674 మంది
  • నేటితో కలిపి మొత్తం 424 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తి

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో  51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. మొత్తం 674 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి హేమాహేమీల నియోజకవర్గాలు కూడా నేటి పోలింగ్‌లో ఉన్నాయి.

కేంద్ర సహాయ మంత్రులు అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, జయంత్‌సిన్హా, జార్ఖండ్‌ మాజీ సీఎం అర్జున్‌ ముండా, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ,  రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, కృష్ణపునియా తదితరులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరుగుతోంది. నేటి పోలింగ్‌తో కలపుకుంటే దేశంలోని  424 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి.  మిగిలిన 118 స్థానాలకు ఆరు, ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది.

  • Loading...

More Telugu News