pm: మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక స్పందన

  • అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లు రాబట్టుకునే మోదీ
  • ఆ అమరులకు మాత్రం గౌరవం ఇవ్వరు
  • అమేథీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు

మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అమరులైన వారి పేర్లు చెప్పుకుని ఓట్లు రాబట్టుకోవాలని మోదీ చూస్తున్నారు కానీ, ఆ అమరులకు మాత్రం గౌరవం ఇవ్వరని విమర్శించారు. రాజీవ్ గాంధీ ఎవరి కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశారో, ఆ అమేథీ ప్రజలే బుద్ధి చెబుతారని, ఇది నిజమని, మోసాన్ని ఈ దేశం ఎప్పుడూ క్షమించదంటూ ఆ ట్వీట్లో మోదీని విమర్శించారు. కాగా, నిన్న యూపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో  రాజీవ్ గాంధీపై మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతి పరుడని మోదీ ఆరోపించారు.

pm
modi
congress
priyanka gandhi
rajiv gandhi
amethi
Uttar Pradesh
  • Loading...

More Telugu News