Odisha: ‘ఫణి’ తుపాన్ బీభత్సం...పూరీ పట్టణంలోనే 21 మంది మృతి
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న కలెక్టర్
- లక్షల సంఖ్యలో నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
- భారీగా ఆస్తి నష్టం
ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణాన్ని ‘ఫణి’ తుపాన్ విధ్వంసం చేసింది. తుపాన్ బీభత్సానికి పూరీ పట్టణంలోనే 21 మంది మృత్యువాత పడ్డారని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇళ్ల గోడలు కూలిన ఘటనలో 9 మంది చనిపోయారని ప్రకటించారు. తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆస్తి నష్టం భారీగా ఉందని, లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయని కలెక్టర్ ప్రకటించారు. విద్యుత్, టెలికాం సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి. తుపాన్ బీభత్సంపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారులతో సమీక్షించి 15 రోజుల వరకు బాధితులకు సాయం కొనసాగించాలని ఆదేశించారు.