Crime News: కళ్లెదుటే పరాయి మహిళలతో చాటింగ్‌...భర్త వక్రబుద్ధిని గమనించి నిలదీసిన భార్య

  • తప్పుచేస్తూ వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయిన మహిళ
  • పోలీసులకు ఫిర్యాదు
  • ప్రేమించి పెళ్లి చేసుకున్నవిజయవాడకు చెందిన జంట 

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తెగించిన ఓ భర్త తీరును నిరసిస్తూ పోలీసులకు ఫిర్యాదుతో గట్టి జవాబిచ్చింది ఆ గృహిణి. తన కళ్లెదుటే ఇతర మహిళలతో చాటింగ్‌ చేస్తూ ప్రేమపాఠాలు వల్లిస్తున్న భర్తకు బుద్ధిచెప్పింది. పోలీసుల కథనం మేరకు...విజయవాడ సమీపంలోని తాడిగడపకు చెందిన కొమ్ము దినేష్‌, విజయ నిర్మల ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు వీరి మధ్య సంబంధం సజావుగా సాగింది. ఆ తర్వాత దినేష్‌లోని మరో మనిషి బయటకు వచ్చాడు. భార్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు మొదలు పెట్టాడు. ఇందుకు భాగస్వామి ఎదురుగానే వారితో సెక్స్‌ చాట్‌ చేస్తుండే వాడు.

దీన్ని గమనించిన విజయ నిర్మల, భర్తను పలుమార్లు నిలదీసింది. ఈ వ్యతిరేకతను తట్టుకోలేకపోయిన దినేష్‌ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. దినేష్‌ చెడు తిరుగుళ్లు తిరుగుతున్న విషయాన్ని అత్త, ఆడ పడచుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు కూడా అతనికే వత్తాసు పలికారు.

ఇక చేసేది లేక తనే స్వయంగా దినేష్‌ను నిలదీసింది. ఆమెను కొట్టి పుట్టింటికి పంపించేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ విజయ నిర్మల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదుచేసి భర్త, అత్తతోపాటు ఇద్దరు ఆడపడుచులపై కేసు నమోదు చేశారు.

Crime News
husbend cheating
wife comlaint
  • Loading...

More Telugu News