Hyderabad: గంజాయిని ద్రవరూపంలోకి మార్చి తేనె బాటిళ్లలో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

  • హైదరాబాద్ లో కొత్త పంథా
  • చిన్న బాటిళ్లలో నింపి విక్రయాలు
  • సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, విద్యార్థులే లక్ష్యం

హైదరాబాద్ లో గంజాయి అమ్మకాల్లో కొత్తరకం దందా వెలుగుచూసింది. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి అధికారులను ఏమార్చుతున్న ఓ ముఠా గుట్టురట్టయింది. విజిలెన్స్ అధికారులు లిక్విడ్ గంజాయి ముఠాను పట్టుకున్నారు. బిర్యానీ ఫుడ్ కలర్ బాటిళ్లు, తేనె బాటిళ్లలో ద్రవరూపంలో ఉన్న గంజాయి నింపి విక్రయాలు సాగిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, విద్యార్థులే లక్ష్యంగా ఈ ముఠా అమ్మకాలు జరుపుతున్నట్టు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరు వంటి నగరాలకు కూడా చిన్న బాటిళ్లలో నింపిన లిక్విడ్ గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News