Aravind Kejriwal: వాహనం పైకి ఎక్కి కేజ్రీవాల్ చెంప చెళ్లుమనిపించిన యువకుడు

  • మోతీ నగర్ లో ఘటన
  • ప్రచారం చేస్తుండగా కేజ్రీవాల్ కు చేదు అనుభవం
  • యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం తప్పలేదు. ఇప్పటికే పలుమార్లు చేదు అనుభవాలు చవిచూసిన ఆయనకు తాజాగా మరోసారి అదే తరహా అనుభవం ఎదురైంది. మోతీ నగర్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, ఓ యువకుడు ఉన్నట్టుండి వాహనంపైకి ఎక్కాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే బలంగా కేజ్రీవాల్ చెంపపై కొట్టాడు. ఆ తీవ్రతకు కేజ్రీవాల్ పక్కకు ఒరిగిపోయారు. దాంతో, ఆమ్ ఆద్మీ కార్యకర్తలు వెంటనే స్పందించి ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

Aravind Kejriwal
New Delhi
  • Loading...

More Telugu News