RBI: నగదు లావాదేవీల యాప్ లపై ఆర్బీఐ కఠినచర్యలు

  • ప్రముఖ మనీ యాప్ లపై భారీగా జరిమానా వడ్డన
  • నిబంధనల ఉల్లంఘనే కారణమన్న ఆర్బీఐ
  • ఎం-పేసా యాప్ కు అత్యధికంగా రూ.3.05 కోట్లు జరిమానా

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల సాయంతో నగదు లావాదేవీలు జరిపేందుకు అనేక యాప్ లు వచ్చాయి. కొన్ని వెబ్ సైట్లు కూడా ఆర్థికపరమైన సేవలు అందిస్తున్నాయి. అయితే, వినియోగదారులకు సేవలు అందించే విషయంలో నిబంధనలు పాటించిన యాప్ లు, వెబ్ సైట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠినచర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఎం-పేసా (వొడాఫోన్), ఫోన్ పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీ, మొబైల్ పేమెంట్స్, వై-క్యాష్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కు నిబంధనల ఉల్లంఘన స్థాయిని బట్టి ఆర్బీఐ జరిమానాలు విధించింది. పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ప్రకారం ఈ జరిమానాలు వడ్డించినట్టు రిజర్వ్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

ఎం-పేసా-రూ.3.05 కోట్లు
ఫోన్ పే-రూ.1 కోటి
మొబైల్ పేమెంట్స్-రూ.1 కోటి
ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీ-రూ. 1 కోటి
వై-క్యాష్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్-రూ.5 లక్షలు
వెస్టర్న్ యూనియన్-రూ.29,66,959
మనీగ్రామ్-రూ.10,11,653

RBI
  • Loading...

More Telugu News