Telangana: ‘తలనొప్పిని తగ్గిస్తా’ అంటూ మహిళతో అసభ్య ప్రవర్తన.. ఉప్పల్ లో డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుందని వ్యాఖ్య
  • రూమ్ లోకి తీసుకెళ్లి మీద చేతులు వేసిన డాక్టర్
  • కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

వైద్యుడు దేవుడితో సమానం అంటారు. ఎలాంటి రోగాన్ని అయినా మందుతో చిటికెలో నయం చేయగల వైద్యులను అమితంగా గౌరవిస్తారు. కానీ ఆ వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ఓ డాక్టర్ వ్యవహరించాడు. తలనొప్పి బాధిస్తోందన్న మహిళను లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు ప్రబుద్ధుడిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు చోటుచేసుకుంది.

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్ బస్తీకి చెందిన ఓ మహిళకు గతకొంతకాలంగా తలనొప్పి వస్తోంది. ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గకపోవడంతో ఆమె బస్తీలో ఉన్న ఆసుపత్రికి వచ్చింది. అక్కడ డా.బాలరాజుకు తన బాధ చెప్పుకుంది. తలనొప్పికి తోడుగా తరచూ దగ్గు కూడా వస్తోందని చెప్పింది. అయితే రోగి అనారోగ్యానికి మందు ఇవ్వాల్సిన బాలరాజు.. కామాంధుడిగా మారిపోయాడు.

‘తలనొప్పి తగ్గాలంటే మసాజ్ చేయాలి’ అంటూ ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అక్కడి నుంచి ఒక్క ఉదుటున లేచిన బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. డా.బాలరాజు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదుచేసిన ఉప్పల్ పోలీసులు డా.బాలరాజును అరెస్ట్ చేశారు.

Telangana
uppal
Hyderabad
doctor
sexual harrsment
Police
arrest
woman
masag to headache
  • Loading...

More Telugu News