Rahul Gandhi: పెద్ద మనసు కావాలి.. పెద్ద ఛాతీ కాదు: శామ్ పిట్రోడా

  • రాహుల్ విద్యావంతుడు, తెలివైనవాడు
  • గత రెండు, మూడేళ్లలో ఆయనలో ఎంతో మార్పు వచ్చింది
  • దేశానికి యువ నాయకత్వం అవసరం

మహాకూటమి అధికారంలోకి వస్తే, ప్రధాని ఎవరనే విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా అన్నారు. అయితే, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని వ్యక్తిగతంగా తాను కోరుకుంటున్నానని చెప్పారు. 'రాహుల్ యువతరానికి చెందినవారు. ఉన్నత విద్యను అభ్యసించారు. తెలివైనవారు. గత దశాబ్ద కాలంగా ఆయన ఎంతో నేర్చుకున్నారు. ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆయనకు తెలుసు.

 గత రెండు, మూడు ఏళ్లలో రాహుల్ లో వచ్చిన గణనీయమైన మార్పును అందరూ చూశారు. రాహుల్ గొప్ప నాయకుడనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు' అని అన్నారు. దేశానికి 40లలో లేదా 50లలో ఉన్న వ్యక్తి ప్రధాని కావాలని... 60 ఏళ్లు దాటినవారు అవసరం లేదని చెప్పారు. మన దేశ జనాభాలో 65 కోట్ల మంది 25 ఏళ్ల లోపు వారేనని... దేశానికి యువ నాయకత్వం కావాలని చెప్పారు. ప్రధానికి హుందాతనం, ఇతరులను గౌరవించే వ్యక్తిత్వం, పెద్ద మనసు ఉండాలని... పెద్ద ఛాతీ అవసరం లేదని మోదీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi
modi
sam pitroda
congress
bjp
  • Loading...

More Telugu News