Odisha: ఒడిశాపై ‘ఫణి’ పడగ.. సహాయ సామగ్రిని ఉచితంగా తరలిస్తామన్న ఎయిర్ఇండియా!
- ఢిల్లీ నుంచి ఉచితంగా తీసుకెళతామని వెల్లడి
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు
- సామాజిక బాధ్యతతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ఎయిర్ఇండియా
పెను తుపాను ‘ఫణి’ ఒడిశాపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. తుపాను తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ సంస్థలు నేలకొరగగా, విమాన, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. చాలాచోట్ల ప్రజలు నిత్యావసరాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఒడిశాలో ఫణి బాధితులకు సహాయ-పునరావాస సామగ్రిని తమ విమానాల్లో ఉచితంగా తీసుకొస్తామని ప్రకటించింది. ఢిల్లీలోని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అందించే సహాయ సామగ్రిని ఉచితంగా ఒడిశాకు తీసుకెళతామని చెప్పింది. సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.