amala paul: భారీ చారిత్రక చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న అమలా పాల్

  • చారిత్రక నేపథ్యంలో మణిరత్నం మూవీ
  • భారీ బడ్జెట్ .. భారీ తారాగణం 
  • ఆగస్టు నుంచి సెట్స్ పైకి 

కథానాయికగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, ఆ తరువాత తమిళ చిత్రాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఒక భారీ చారిత్రక చిత్రంలో కీలకమైన పాత్రను చేయడానికి ఆమె అంగీకరించిందనేది తాజా సమాచారం. రాజ రాజ చోళునికి సంబంధించిన కథను 'పొన్నియిన్ సెల్వన్' అనే టైటిల్ తో రూపొందించడానికి మణిరత్నం సన్నాహాలు చేసుకుంటున్నారు.

జియో స్టూడియోస్ తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకిగాను, అమితాబ్ .. కార్తీ .. విజయ్ సేతుపతి .. జయం రవి .. ఐశ్వర్యరాయ్ .. అనుష్క .. కీర్తి సురేశ్ లను ఎంపిక చేసుకున్నారు. మరో ముఖ్యమైన పాత్ర కోసం అమలా పాల్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్టును గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

amala paul
keerthi suresh
Anushka Shetty
  • Loading...

More Telugu News