Andhra Pradesh: అన్ని రాష్ట్రాల్లోనూ సీఎంల దగ్గరకు సీఎస్ లు వస్తారు.. ఏపీలో మాత్రం రారు!: చంద్రబాబు

  • సీఎం దగ్గరకు వచ్చి మాట్లాడాలని సీఎస్ కు తెలియదా?
  • బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే సహించను
  • నా అనుభవంలో ఇలాంటి వాళ్లను చాలా మందిని చూశా

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల్లో సీఎంల దగ్గరకు సీఎస్ లు వస్తారని, ఏపీలో మాత్రం రారని విమర్శించారు. సీఎం దగ్గరకు వచ్చి మాట్లాడాలని సీఎస్ కు తెలియదా? అధికారులు ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే సహించనని హెచ్చరించారు.

సీఎస్ ఆ పదవిలో కొన్ని నెలలు ఉంటారని, తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి వాళ్లను చాలా మందిని చూశానని అన్నారు. ‘నేను ఎవరికీ భయపడను. ఎవరి బాధ్యత వారు నిర్వహిస్తే మంచిది?’ అని సూచించారు. హద్దులు దాటితే కేబినెట్ భేటీ నిర్వహించి బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే వారం మంత్రి వర్గ సమావేశం ఉంటుందని చెప్పారు. వచ్చే సోమవారం పోలవరం వెళ్తున్నానని, ప్రజలు ఎన్నుకున్న తనకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News