akshay kumar: కెనడా పౌరసత్వంపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందన

  • నాకు కెనడా పాస్ పోర్టు ఉందనే విషయాన్ని ఎన్నడూ దాచలేదు
  • ఏడేళ్లలో ఒక్కసారి కూడా కెనడాకు వెళ్లలేదు
  • ఇక్కడే పని చేస్తున్నా.. ఇక్కడే పన్నులు కడుతున్నా

అనవసరమైన విషయాల్లోకి తననెందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశాడు. తన పౌరసత్వంపై అనవసరమైన ఆసక్తి ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదని అన్నాడు. తనకు కెనడా పాస్ పోర్టు ఉందనే విషయాన్ని ఎన్నడూ దాచలేదని చెప్పాడు. గత ఏడేళ్లలో తాను ఒక్కసారి కూడా కెనడాకు వెళ్లలేదనే విషయం కూడా నిజమని తెలిపాడు.

తాను ఇండియాలో పని చేస్తున్నానని, ఇక్కడే పన్నులు కడుతున్నానని చెప్పాడు. ఇన్నేళ్ల తన జీవితంలో దేశం పట్ల తనకున్న ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం రాలేదని... తన పౌరసత్వం అంశాన్ని వివాదాస్పదం చేయడం బాధను కలిగిస్తోందని తెలిపాడు. తన పౌరసత్వం అనేది రాజకీయాలకు అతీతమైనది, చట్టబద్ధమైనది, వ్యక్తిగతమైనదని... ఇతరులకు దీంతో ఏం పని? అని ప్రశ్నించాడు. భారత్ ను బలోపేతం చేసే అంశంలో తన వంతు సహకారాన్ని ఎప్పుడూ అందిస్తూనే ఉంటానని చెప్పాడు.

akshay kumar
bollywood
citizenship
canada
  • Loading...

More Telugu News