: ఆంధ్ర పార్టీలను బొందపెట్టాలి: కేసీఆర్


టీఆర్ఎస్ లో కడియం శ్రీహరి చేరిన సందర్భంగా కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కడియం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితే రాజకీయ వ్యభిచారం అంటారా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ జాతి విముక్తికోసమే కడియం టీఆర్ఎస్ లో చేరారన్నారు. తెలంగాణకు ఆంధ్ర పార్టీలు అవసరమా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడుతోందని, అందరూ తెలంగాణ కోసం ఏకం కావాల్సిన అవసరం ఉందని ఉద్యమకారులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర పార్టీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

రానున్న ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలను గెలిచి ఢిల్లీని శాసిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు ఋణ మాఫీ చేస్తానని, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్భంద ఇంగ్లీషు మీడియం విద్యనందిస్తామని హామీ ఇచ్చారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్, కడియం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదని, అత్యంత కీలక పదవిలో ఉండాల్సిన వ్యక్తని అన్నారు.

  • Loading...

More Telugu News