Andhra Pradesh: హైదరాబాద్ లో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా చూసిన వైఎస్ జగన్!

  • ఇటీవల స్విట్జర్లాండ్ పర్యటనకెళ్లిన జగన్
  • హిమాచల్ కు చంద్రబాబు ఫ్యామిలీ టూర్
  • ఏఎంబీ థియేటర్ లో సినిమా చూసిన వైసీపీ అధినేత

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన నేతలు ఎన్నికల పోలింగ్ ముగియగానే విశ్రాంతి తీసుకుంటున్నారు. పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలను చుట్టి వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిరాగా, ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తమ కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ టూర్ కు వెళ్లారు.

తాజాగా వైసీపీ అధినేత జగన్ ఓ హాలీవుడ్ సినిమాను చూశారు. నగరంలోని ఏఎంబీ సినిమాస్ లో ‘అవెంజర్స్ .. ఎండ్ గేమ్’ సినిమాను జగన్ వీక్షించారు. బూడిద రంగు షర్ట్, తెలుగు రంగు ఫ్యాంట్ తో థియేటర్ కు వచ్చిన జగన్, సినిమాను ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Andhra Pradesh
Telangana
YSRCP
Jagan
amb theratre
avengers end game
  • Loading...

More Telugu News