ssr concrete: కార్మికుల ఆనందంలో పాలుపంచుకున్న ఎస్ఎస్ఆర్ కాంక్రీట్ యాజమాన్యం

  • మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఎస్ఎస్ఆర్ కాంక్రీట్
  • కార్మికులు, సంస్థ యాజమాన్యం కలసిపోయి క్రికెట్ మ్యాచ్ లు
  • కార్యక్రమంలో పాల్గొన్న 650 మంది కార్మికులు

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఎస్ఎస్ఆర్ కాంక్రీట్ సంస్థ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించింది. ఏడాది పొడవునా సంస్థ కోసం పని చేస్తున్న కార్మికులు తమ దినచర్యలకు దూరంగా, ఆటపాటలతో హుషారుగా గడిపేలా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా వట్టినాగులపల్లిలో కార్మికులు, సంస్థ యాజమాన్యం కలసిపోయి క్రికెట్ మ్యాచ్ లు ఆడారు. 650 మంది కార్మికులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అందరికీ విందు ఏర్పాటు చేశారు. విజేతలకు సంస్థ మేనేజింగ్ పార్ట్ నర్స్ వెంకటరెడ్డి, వంశీ రెడ్డి, మౌనీశ్ రెడ్డిలు ట్రోఫీలు అందజేశారని జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ssr concrete
hyderabad
may day
cricket
  • Loading...

More Telugu News