Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి!: కింజరపు రామ్మోహన్ నాయుడు

  • ఫణి సైక్లోన్ పూరి తీరాన్ని తాకింది
  • ఉద్దానంపై కూడా ప్రభావం చూపింది
  • ఇక్కడ మౌలిక వసతులను పునరుద్ధరిస్తున్నాం

పెను తుపాను ఫణి ఒడిశాలోని పూరీ తీరాన్ని తాకిందని టీడీపీ నేత, లోక్ సభ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.  ఫణి ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం వాసులంతా అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని కోరారు.

ఉద్దానం మండలంలోని గ్రామాలపై ఫణి ప్రభావం ఉందనీ, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం 24 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇక్కడ మౌలిక వసతులను పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
phani
cyclone
Srikakulam District
Telugudesam
rammohan naidu
kinjarapu
  • Loading...

More Telugu News