Narendra Modi: నరేంద్ర మోదీ బయోపిక్ విడుదలకు రెడీ... డేట్ ప్రకటించిన నిర్మాతలు!

  • పలు మార్లు వాయిదా పడ్డ బయోపిక్
  • 24న విడుదల చేయనున్నాం
  • ప్రకటించిన నిర్మాత సందీప్ సింగ్

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' కౌంటింగ్ మరుసటి రోజే విడుదల కానుంది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మే 23 వరకూ సినిమాను విడుదల చేయవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

 సినిమా విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా నిర్మాత సందీప్‌ సింగ్‌ మాట్లాడారు. ఓ బాధ్యత గల పౌరుడిగా చట్టాలను గౌరవించడం తన కర్తవ్యమని, చర్చించిన తరువాత, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత మాత్రమే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. ఇక సినిమాపై ఎవరికీ అభ్యంతరాలు ఉండవని అనుకుంటున్నానని, ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, ఈ సినిమాలో వివేక్‌ ఒబెరాయ్‌, నరేంద్ర మోదీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 


Narendra Modi
Biopic
Release Date
  • Loading...

More Telugu News