pm: ‘కోడ్’ అమల్లో ఉండగానే మోదీపై పుస్తకం విడుదల

  • ‘భారత్ బోధ్ కా సంఘర్ష్: 2019 కా మహా సమర్’ పుస్తకం
  • ఇది ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినది కాదు
  • పుస్తక రచయిత వీసీ కులదీప్ చంద్ అగ్నిహోత్రి వివరణ

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన ఓ పుస్తకం ఇటీవల విడుదలైంది. ఏప్రిల్ 29న నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించిన జాతీయ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తక రచయిత హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ కులదీప్ చంద్ అగ్నిహోత్రి.

హిందీ భాషలో రచించిన ‘భారత్ బోధ్ కా సంఘర్ష్: 2019 కా మహా సమర్’ పుస్తకాన్ని ధర్మశాల పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. అయితే, ఈ పుస్తకం విడుదల చేయడంపై కులదీప్ చంద్ అగ్నిహోత్రికి కుగ్రా జిల్లా ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ పుస్తకం ఎందుకు విడుదల చేశారో చెప్పాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు.

పుస్తక రచయిత కులదీప్ చంద్ అగ్నిహోత్రి దీనికి స్పందిస్తూ, ఈ పుస్తకం ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణ ఉందని చెప్పారు. గత పదిహేనేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలపై వ్యాసాల సంపుటి మాత్రమేనని స్పష్టం చేశారు.  

  • Loading...

More Telugu News