priyanka gandhi: చౌకీదార్ చోర్ హై అని నినదించిన చిన్నారులు.. చిక్కుల్లో ప్రియాంక గాంధీ

  • ప్రియాంక ఎదురుగా పిల్లల నినాదాలు
  • ఎన్నికల ప్రచారంలోకి పిల్లలు ఏంటంటూ ఎన్‌సీపీఆర్‌సీ ఆగ్రహం
  • మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఆమె ఎన్నికల ప్రచారంలో కనిపించిన కొందరు చిన్నారులు ‘చౌకీదార్ చోర్ హై’ అని గట్టిగా నినదించారు. ఇది చూసిన ప్రియాంక.. అలా అనడం తప్పని వారిని వారించారు. మంచి మాటలు మాత్రమే మాట్లాడాలని, పిల్లలు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదంటూ వారి వద్దకు వెళ్లి హితవు పలికారు. చిన్నారులు ప్రధానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇది కాస్తా జాతీయ బాలల హక్కుల సంఘం (ఎన్‌సీపీఆర్‌సీ) దృష్టిలో పడడంతో తీవ్రంగా స్పందించింది. ఎన్నికల ప్రచారంలోకి పిల్లలను తీసుకురావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిల్లల పేర్లు, పూర్తి వివరాలు, ఘటన ఎక్కడ జరిగిందీ తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. అంతేకాదు, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లింది.

priyanka gandhi
Congress
ncprc
childern
election
  • Loading...

More Telugu News