MAA: మంచి చేద్దాం..ఎదుటి వారి గురించి చెడు చెప్పడం మానేద్దాం: 'మా' సభ్యులకు జీవితా రాజశేఖర్ హితవు

  • పాలిటిక్స్ లోకి ‘మా’ను లాగొద్దు
  • పాత విషయాలు తవ్వుకోవద్దు
  • మనల్ని మనం కించపరచుకోవద్దు

‘మంచి చేద్దాం.. ఎదుటి వారి గురించి చెడు చెప్పడం మానేద్దాం’ అని ‘మా’ జనరల్ సెక్రటరీ, సినీ నటి జీవితా రాజశేఖర్ అన్నారు. ‘మా’ ఎన్నికల సమయంలో ప్రముఖ సినీ నటుడు నాగబాబుపై అప్పటి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 ‘మా’లో ఉన్న ఆర్టిస్ట్ లందరికీ సాయం చేయాలన్న సదుద్దేశంతోనే తాము వచ్చామని చెప్పారు. గతంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మన గురించి అనవసరమైన విషయాలను బయటపెట్టడం ద్వారా మనల్ని మనం కించపరచుకోవద్దని నిర్ణయించుకున్న తర్వాత కూడా ఇలాంటి ఒకట్రెండు సంఘటనలు జరగడం చాలా బాధాకరమని అన్నారు. పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవచ్చు కానీ, అందులోకి ‘మా’ను లాగడం తగదని హితవు పలికారు. పాత విషయాలను తవ్వుకుని శత్రుత్వాన్ని పెంచే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు.

MAA
General Secretary
Jeevita
Rajasheker
  • Loading...

More Telugu News