Anuradha: టీఆర్ఎస్ నేతలు తనతో బలవంతంగా నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారంటున్న మహిళా అభ్యర్థి!

  • నామినేషన్ సందర్భంగా వివాదం
  • కాంగ్రెస్ తరుపున నామినేషన్
  • కన్నీళ్లు పెట్టుకున్న అనురాధ

ఎంపీటీసీ నామినేషన్ సందర్భంగా నిర్మల్ మండలంలోని మేడిపల్లిలో వివాదం చోటు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ తరుపున నామినేషన్ వేసిన గొర్ల అనురాధ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. అయితే తను నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ నేతలని ఆమె పేర్కొన్నారు. బెదిరించి, బలవంతంగా తన చేత విత్‌డ్రా కాగితాలపై సంతకాలు చేయించారని ఆమె మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Anuradha
TRS
Congress
Nomination
Nirmal
With Draw
  • Loading...

More Telugu News