Andhra Pradesh: జూలై చివరి నాటికి చింతలపూడి ఫేజ్-2 ద్వారా నీళ్లు అందిస్తాం!: ఏపీ మంత్రి దేవినేని ఉమ
- ప్రాజెక్టు పనులను పరిశీలించిన టీడీపీ నేత
- రైతుల సహకారంతో 100 కి.మీ కాలువ తవ్వినట్లు వెల్లడి
- ఎన్నికల కోడ్ కారణంగా పనులు ఆగాయని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 ఆక్విడెక్ట్ పనులను పరిశీలించారు. తమ్మిలేరు వద్దకు చేరుకున్న ఉమ, పనులు జరుగుతున్న తీరును ఇంజనీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పందిస్తూ.. జూలై నెలాఖరు కల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 ద్వారా నీళ్లు అందిస్తామని తెలిపారు.
రైతుల సహకారంతో ఇక్కడ 100 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు పూర్తి చేశామని అన్నారు. మిగిలిన పనులు కూడా శరవేగంతో సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకం ఏర్పడ్డాయనీ, అయినా పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని ఉమ అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.