medical collegers: ఏపీ వైద్య కళాశాలలో 190 సీట్ల పెంపు

  • ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌తో అదనపు సీట్లు కేటాయింపు
  • రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్‌ కళాశాలు
  • సౌకర్యాలను బట్టి ఆయా కళాశాలలకు సీట్ల సర్దుబాటు

వైద్య విద్య అభ్యసించాలనుకునే ఏపీ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్లకు అదనంగా మరో 200 సీట్లు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అగ్రకులాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు ప్రత్యేక రిజర్వేషన్‌ కేటాయించడంతో ఈ అదనపు సీట్లు మంజూరు చేశారు.

ఏపీలో మొత్తం 12 వైద్య కళాశాలలుండగా ఆరు కళాశాలల్లో 200 చొప్పున, మూడు కళాశాలల్లో 150 సీట్లు చొప్పున, మరో మూడు కళాశాలల్లో 100 సీట్లు చొప్పున ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఉన్న సదుపాయాలు, వసతుల ఆధారంగా కొత్తగా కేటాయించిన సీట్లను ఆయా కళాశాలలకు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ నెల 15లోగా పంపాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలేజీలకు లేఖ రాసింది.

medical collegers
seats hike
EWS
  • Loading...

More Telugu News