Paddy Upton: ప్యాడీ ఆప్టన్ వ్యాఖ్యలపై స్పందించిన గంభీర్

  • గంభీర్ అభద్రతాభావంతో కనిపించేవాడన్న ఆప్టన్
  • ‘ది బేర్‌ఫుట్‌ కోచ్‌’లో తీవ్ర వ్యాఖ్యలు
  • సానుకూలంగా స్పందించిన గంభీర్

తన మానసిక పరిస్థితిపై వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ మానసిక నిపుణుడు ప్యాడీ ఆప్టన్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతం గంభీర్ స్పందించాడు. ఆప్టన్‌ వ్యాఖ్యలను సానుకూలంగా తీసుకున్న గంభీర్ జట్టుతోపాటు తాను కూడా అత్యుత్తమంగా నిలవాలనే కసితోనే సెంచరీ కొట్టినా అంతగా ఆనందించేవాడిని కాదన్నాడు.  

ప్యాడీ ఆప్టన్ రాసిన పుస్తం ‘ది బేర్‌ఫుట్‌ కోచ్‌’లో గంభీర్‌పై తనకున్న అభిప్రాయాలను ఆప్టన్ వెల్లడించాడు. గంభీర్ ఎప్పుడూ అభద్రతాభావంతో ఉండేవాడని, ఏ విషయంలోనూ సంతృప్తి చెందేవాడు కాదని పేర్కొన్నాడు. ఎప్పుడూ నిరాశగా ఉండేవాడని, తప్పులను గుర్తు చేసుకుంటూ పదపదే బాధపడుతూ ఉండేవాడని ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు.

అంతేకాదు, సెంచరీ కొట్టినా అతడి ముఖంలో సంతోషం కనిపించేది కాదన్నాడు. గంభీర్ మానసిక పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ఎంతగానో శ్రమించానని, ఈ విషయంలో కొంత వరకు విజయం సాధించానని వివరించారు. తాను అతడిపై మరింత దృష్టి సారించి ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలిచేవాడని ప్యాడీ ఆప్టన్ వివరించాడు.

Paddy Upton
Gautam Gambhir
Team India
BJP
New Delhi
  • Loading...

More Telugu News