Tollywood: దర్శకనటుడు ఆర్.నారాయణమూర్తికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
- దాసరి అవార్డును అందుకున్న నారాయణమూర్తి
- ప్రసాద్ ల్యాబ్స్ లో కార్యక్రమం
- ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ రోశయ్య
విప్లవ చిత్రాలే తన పంథాగా కొనసాగుతున్న నటుడు ఆర్.నారాయణమూర్తిని దాసరి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు వరించింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ, భీమవరం టాకీస్, ఏబీసీ ఫౌండేషన్ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో దాసరి స్మారక సినీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తికి జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.
కాగా, దాసరి ఎక్సలెన్సీ అవార్డును పూరీ జగన్నాథ్ తరఫున ఆయన తనయుడు ఆకాశ్ అందుకున్నారు. దాసరి నారాయణరావు, పద్మ స్మారక అవార్డు రాజశేఖర్, జీవిత దంపతులను వరించింది.