Narendra Modi: గడ్చిరోలి ఘటన మోదీ వైఫల్యమే: కాంగ్రెస్ విమర్శల దాడి

  • 16 మంది జవాన్ల మృతిపై కాంగ్రెస్ స్పందన
  • మరోసారి జవాన్ల కాన్వాయ్ లక్ష్యంగా మారింది
  • జవాబుదారీతనంపై ఉపన్యాసాలు దంచే ప్రధాని దీనికేమంటారు?

మావోలు తమ ఉనికిని చాటుకునే యత్నంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి వద్ద 16 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం మందుపాతర పేలడంతో తునాతునకలైంది. జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది.

పుల్వామా ఘటన నుంచి కేంద్రం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ఇవాళ్టి గడ్చిరోలి సంఘటనతో రుజువైందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు. మరోసారి వ్యతిరేక శక్తులకు మన జవాన్ల కాన్వాయ్ లక్ష్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందుజాగ్రత్త చర్యలు లేకుండానే జవాన్లను తరలించడం ఎంత ప్రమాదకరమో పుల్వామా దాడితో తెలిసి వచ్చిందని, కానీ, మరోసారి జవాన్లు బలవడం చూస్తుంటే ఇది మోదీ సర్కారు వైఫల్యంగానే భావించాలని అన్నారు. వైఫల్యానికి జవాబుదారీతనం అవసరమంటూ మోదీ ఉపన్యాసాలు దంచుతుంటారని, దీనికి ఆయనేం బదులిస్తారని అహ్మద్ పటేల్ నిలదీశారు.

  • Loading...

More Telugu News