Chandrababu: తుపాను ముంచుకొస్తోంది.. సమీక్ష కూడా చేయకుండా చేస్తున్నారు: ఈసీపై చంద్రబాబు ఫైర్

  • అడుక్కుని సమీక్షలు చేయాల్సి వస్తోంది
  • ప్రధానికి ఉన్న వెసులుబాటు సీఎంలకు ఉండదా?
  • మే 23 తర్వాత మహాకూటమి నేతలంతా సమావేశమవుతాం

ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఓవైపు ఫణి తుపాను ముంచుకొస్తుంటే, మరోవైపు తుపానుపై సమీక్షకు కూడా అవకాశం లేకుండా ఈసీ చేస్తోందని దుయ్యబట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై రేపట్నుంచి తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని... ఈసీని అడుక్కుని సమీక్షలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానికి అడ్డురాని ఎన్నికల కోడ్ ముఖ్యమంత్రులకు మాత్రమే ఎందుకు అడ్డొస్తోందని ప్రశ్నించారు. ప్రధానికి ఉన్న వెసులుబాటు సీఎంలకు ఉండదా? అని అడిగారు. ఎన్నికల నియమావళి అందరికీ ఒకే విధంగా ఉండదా? అని ఎద్దేవా చేశారు.

ఎన్నికల కోడ్ ను మోదీ ఎన్నిసార్లు ఉల్లంఘించినా నోటీసులు ఇవ్వరని మండిపడ్డారు. మే 23 తర్వాత మహాకూటమి ఉండదని మోదీ అంటున్నారని, ఆయనకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఫలితాలు రాగానే మహాకూటమి నేతలంతా సమావేశం అవుతామని, ప్రధాని ఎవరు కావాలనే అంశంపై చర్చిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News