ramdas athawale: బుర్ఖాపై నిషేధం వద్దు: రాందాస్ అథవాలే
- ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించడం సంప్రదాయం
- బుర్ఖాలు ధరించే వారంతా ఉగ్రవాదులు కాదు
- ఉగ్రవాదులైతే వారి బుర్ఖాలను తొలగించాల్సిందే
ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాలపై శ్రీలంక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా బుర్ఖాలను నిషేధించాలనే డిమాండ్ వినపడుతోంది. బుర్ఖాలను నిషేధించాలంటూ శివసేన డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ, ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించడం మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమని, అది వారి హక్కు అని అన్నారు. బుర్ఖాలు ధరించే మహిళలంతా ఉగ్రవాదులు కాదని చెప్పారు. బుర్ఖాలను ధరించిన మహిళలు ఉగ్రవాదులైతే వారి బుర్ఖాలను తొలగించాల్సిందేనని అన్నారు. మన దేశంలో బుర్ఖాపై నిషేధం విధించరాదని కోరారు.