Ramgopal Varma: ఆ బలమైన శక్తి ఎవరో అందరికీ తెలుసు: రామ్ గోపాల్ వర్మ

  • ఈసీపై కోర్టుకు వెళ్లనున్నాం
  • హైకోర్టు తీర్పును అనుసరించే విడుదలకు ప్లాన్
  • ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ

తాను దర్శకత్వం వహించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో విడుదల కానివ్వకుండా అడ్డుకున్నందుకు ఈసీపై కోర్టుకు వెళ్లనున్నట్టు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఏపీ హైకోర్టు తీర్పును అనుసరించే తాము నేడు సినిమా విడుదలకు ప్లాన్ చేసుకున్నామని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న వర్మ, ఈసీ తమ పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. సినిమా విడుదలకు అనుమతించిన తరువాత ఇలా చేయడం ఏంటని ప్రశ్నించిన ఆయన, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న బలమైన శక్తి ఎవరో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.

Ramgopal Varma
Twitter
Lakshmi's NTR
  • Error fetching data: Network response was not ok

More Telugu News