Sujana Chowdary: సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరు కావలసిందే!: స్పష్టం చేసిన హైకోర్టు

  • సుజనా పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం
  • శారీరకంగా హింసించ వద్దు 
  • రెండ్రోజుల్లో విచారణ ముగించాలంటూ సీబీఐకి సూచన

టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరు కావల్సిందేనంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన నోటీసులను సుజనా హైకోర్టులో సవాల్ చేయగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే, సుజనాకు ఊరట కలిగించేలా న్యాయమూర్తులు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.

బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సుజనాచౌదరిని ఆదేశించిన హైకోర్టు, మే 27, 28 తేదీల్లో రెండ్రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని సీబీఐకి తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే ఆయనను విచారించాలని, మధ్యలో మధ్యాహ్న భోజనానికి తగినంత విరామం ఇవ్వాలని సూచించింది. ముఖ్యంగా, ఎట్టిపరిస్థితుల్లోనూ సుజనా చౌదరిని అరెస్ట్ చేయవద్దని, అలాగే శారీరకంగా హింసించడం లాంటి చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News