Rahul Gandhi: రాహుల్ ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు: ప్రియాంక ఫైర్

  • రాహుల్ కు బ్రిటీష్ పౌరసత్వం ఉందని ఆరోపిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి
  • కాంగ్రెస్ అధినేతకు కేంద్ర హోంశాఖ నోటీసులు
  • అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్న ప్రియాంక

విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటూ కేంద్ర హోంశాఖ ఆయనకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మేరకు రాహుల్ నుంచి వివరణ కోరింది. ఈ నేపథ్యంలో రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ఇక్కడే పుట్టాడని, ఇక్కడే పెరిగాడని... అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడంటూ గత కొన్నేళ్లుగా సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తున్నారు. రాహుల్ కు నాలుగు పాస్ పోర్టులు ఉన్నాయని, అందులో ఒకటి రౌల్ విన్సీగా ఉందని, ఆయన మతం కూడా క్రిస్టియన్ గా ఉందని స్వామి దుమారం రేపారు. ఈ నేపథ్యంలోనే, రాహుల్ కు కేంద్ర హోంశాఖ నోటీసులు జరీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

Rahul Gandhi
priyanka gandhi
citizenship
congress
bjp
subrahmanian swamy
  • Loading...

More Telugu News