fani: దూసుకొస్తున్న ఫణి.. ఏపీ ఓడ రేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ

  • విశాఖ తీరానికి 670 కి.మీ. దూరంలో ఫణి
  • కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ
  • ఉత్తర కోస్తాపై తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం

తీవ్ర తుపానుగా మారిన ఫణి ప్రమాద ఘంటికలు మోగిస్తూ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఇది విశాఖ తీరానికి 670 కిలో మీటర్లు, పూరి తీరానికి 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఇది మరింత బలపడి పెను తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఓడరేవులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, కాకినాడ, గంగవరం రేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, విశాఖపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. రేపటి నుంచి 4వ తేదీ వరకు తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News