Hazipur: బావిలో నుంచి కల్పన మృతదేహం అవశేషాలు వెలికితీత!

  • నాలుగేళ్ల క్రితమే హత్య
  • కొన్ని నమూనాలను మాత్రం బయటకు తెచ్చిన పోలీసులు
  • ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అరాచకాలు

హాజీపూర్ మానవ మృగం చేతిలో నాలుగేళ్ల క్రితం చిదిమివేయబడ్డ చిన్నారి కల్పన మృతదేహం అవశేషాలను పోలీసులు వెలికితీశారు. ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు దొరికిన బావికి దగ్గర్లో ఉన్న మరో బావిలో కల్పనను పూడ్చి పెట్టానని రాక్షస ఉన్మాది మర్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో, పోలీసులు బావిలో తవ్వకాలు చేపట్టారు.

హత్య జరిగి నాలుగేళ్లకు పైగా కావడంతో ఎముకలు కూడా నశించిపోయాయి. కేవలం నాడు కల్పన ధరించిన దుస్తులు చీకిపోయిన స్థితిలో లభించాయి. వాటితో పాటు ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల కోసం కొన్ని నమూనాలను మాత్రమే పోలీసులు బయటకు తీసుకువచ్చారు. శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Hazipur
Srinivasreddy
Kalpana
Deadbody
Well
  • Loading...

More Telugu News