Chandrababu: చంద్రబాబూ... ఇందులో ఒక్కటైనా నిజమైందా?: విజయసాయిరెడ్డి

  • దావోస్ కు వెళ్లి వచ్చి చంద్రబాబు కోతలు
  • ఒక్క కంపెనీ కూడా రాలేదు
  • ట్విట్టర్ లో విజయసాయి విమర్శలు

చంద్రబాబు ఏపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2015లో దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సుకు వెళ్లి వచ్చిన తరువాత రాష్ట్రానికి రానున్నాయని చెప్పిన ఏ కంపెనీ కూడా ఇంతవరకూ రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు. "దావోస్ ఆర్థిక సదస్సు- 2015 నుంచి తిరిగొచ్చాక బుల్లెట్ ట్రెయిన్ కోసం స్పెయిన్ ను, డ్వాక్రా ఉత్పత్తులు మార్కెటింగుకు వాల్ మార్ట్ ను ఒప్పించానని, కొబ్బరి నీళ్లను పెప్సీ అమ్ముతుందని కోశాడు. విమానాల ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ వస్తోందని అన్నాడు. ఇందులో ఒక్కటన్నా నిజమైందా?" అని ప్రశ్నించారు. ఆపై "టిడిపి నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. సిఎస్ తక్షణం కొరడా ఝుళిపించాలి" అని కోరారు.



  • Loading...

More Telugu News