BJP: కేజ్రీవాల్ భార్యకు రెండు ఓటరు కార్డులున్నాయి.. ఫిర్యాదు చేసిన బీజేపీ

  • ఉత్తరప్రదేశ్‌లోని షహీబాబాద్‌, ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో సునీత కేజ్రీవాల్‌కు ఓట్లు 
  • గంభీర్‌పై కాంగ్రెస్ ఫిర్యాదుకు బీజేపీ ప్రతీకారం
  • తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు రెండు ఓటరు కార్డులున్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేత హరీశ్ ఖురానా సోమవారం తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేశారు. సునీతకు ఉత్తరప్రదేశ్‌లోని షహీబాబాద్‌ (ఘజియాబాద్)లో ఓ ఓటరు గుర్తింపు కార్డు ఉండగా, ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో మరో ఓటరు ఐడీ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్‌కు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఒకటి, కరోల్‌బాగ్‌లో మరో ఓటరు కార్డు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి మార్లేనా ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత బీజేపీ ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. గంభీర్‌పై ఇదే కోర్టులో అతిషి క్రిమినల్ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అదే కోర్టులో ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

BJP
Arvind Kejriwal
Sunita Kejriwal
AAP
goutam gambhir
  • Loading...

More Telugu News