Himalayas: హిమాలయాల్లో 'యతి'... పాదముద్రల చిత్రాలు విడుదల చేసిన సైన్యం!
- 9న సాహసయాత్రకు వెళ్లిన సైన్యం
- మకలు బేస్ క్యాంప్ సమీపంలో పాదముద్రలు
- వైరల్ అవుతున్న ఫోటోలు
హిమాలయ పర్వత సాణువుల్లో భారీ ఖాయంతో ఉండి 'యతి'గా పిలవబడే మంచుమనిషి ఉన్నాడని చెబుతూ, భారత సైనికుల బృందం ఫోటోలు విడుదల చేసింది. మంచుకొండల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందానికి మంచు మనిషి పాదముద్రలు కనిపించడంతో వారు ఫోటోలు తీశారు. ఏప్రిల్ 9వ తేదీన మకలు బేస్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లిన సైనిక బృందం, అక్కడే ఈ పాదముద్రలను చూసింది. దాదాపు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో పాదముద్రలు ఉన్నాయని ఈ సాహసబృందం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. మంచు మనిషి పాదముద్రల ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పలువురు పర్వతారోహకులు తాము కూడా అటువంటివి చూశామని కామెంట్లు పెడుతున్నారు.