Chandrababu: 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం: మోదీపై చంద్రబాబు ఫైర్

  • ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారు
  • ప్రధాని హోదాను దిగజార్చారు
  • ప్రధాని వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా స్వీకరించాలి

ఉత్తరాదిలో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు.

"ప్రధాని తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి ద్రోహం తలపెడుతున్నారు. ప్రధాని హోదాను దిగజార్చుతున్నారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలకు ఇది పరాకాష్ట. అయినా, ఓ రాష్ట్ర శాసనసభ్యులు తనతో టచ్ లో ఉన్నారని చెప్పడం దేశ ప్రధాని స్థాయికి తగిన విషయం కాదు. ఇది కచ్చితంగా అనైతిక వ్యవహారమే! ఎన్నికల సంఘం నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలా? ఈ సిగ్గుమాలిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ప్రధానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి" అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News