Aditya: యువకుడి ప్రాణం తీసిన మితిమీరిన వ్యాయామం!
- వ్యాయామం చేస్తూ కుప్పకూలిన ఆదిత్య
- టాబ్లెట్‌ను ఇచ్చిన జిమ్ నిర్వాహకులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో దారుణం జరిగింది. స్థానిక గోల్డెన్ జిమ్‌లో మితి మీరిన వ్యాయామం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆదిత్య అనే యువకుడు నేడు జిమ్‌లో అధిక వ్యాయామం చేశాడు. దీంతో అతనికి ఛాతి నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే జిమ్ నిర్వాహకులు అతనికి ఓ టాబ్లెట్‌ను ఇచ్చారు. అది వేసుకున్న అనంతరం ఆదిత్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదిత్య మరణించాడు.