Andhra Pradesh: మా నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు.. ఆగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి!: మంత్రి జవహర్ హెచ్చరిక

  • మీ పార్టీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి
  • వైసీపీ ఎమ్మెల్యే రక్షనిధికి సూచించిన జవహర్
  • తిరువూరులో మీడియాతో టీడీపీ నేత

టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని ఏపీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ నేత, తిరువూరు ఎమ్మెల్యే రక్షనిధికి సూచించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కృష్ణా జిల్లా తిరువూరులో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలతో కలిసి మంత్రి జవహర్ మాట్లాడారు.

వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని జవహర్ మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
jawahar
attacks
Krishna District
tiruvuru
warning
  • Loading...

More Telugu News