KCR: కేసీఆర్.. ఉద్యమ నాయకుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా?: డీకే అరుణ

  • విద్యార్థులకు ఎందుకు భరోసా ఇవ్వడం లేదు
  • సీఎం కుర్చీపై కూర్చేనే అర్హతే నీకు లేదు
  • హైదరాబాద్ లో మీడియాతో బీజేపీ నేత

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు భరోసా ఇవ్వడం లేదని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. 23 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కారణమైన కేసీఆర్ ను ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు.

లక్షలాది మంది భవిష్యత్ గందరగోళంలో పడటానికి కారణమైన వారిపై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని అరుణ నిలదీశారు. హైదరాబాద్ లోఈరోజు ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ బీజేపీ నేత లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు హాజరైన అరుణ, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

‘ఇంటర్ విద్యార్థుల విషయంలో భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నా, ఇంకా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదు. ఉద్యమ నాయకుడిని అని చెప్పుకునేందుకు సిగ్గుగా అనిపించడం లేదా కేసీఆర్? ఆ ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చునే అర్హతే నీకు లేదు’ అని అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

  • Loading...

More Telugu News