kutumba rao: బెయిల్ పై వచ్చి బతుకుతున్న పిచ్చి కుక్క విజయసాయిరెడ్డి: కుటుంబరావు

  • అప్పులు పెరిగిపోయాయంటూ పిచ్చి కుక్కలా అరుస్తున్నారు
  • ఆర్థిక అంశాలపై బహిరంగ చర్చకు రావాలి
  • ఖర్చుల వివరాలు కావాలంటే మెయిల్ ద్వారా పంపుతాం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయంటూ విజయసాయిరెడ్డి పిచ్చికుక్కలా అరుస్తున్నారని అన్నారు. గతంలో కంటే ఈ ఏడాది అప్పులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆర్థిక అంశాలపై దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయి దొంగ ఆడిటర్ కాదా? అని ప్రశ్నించారు. బెయిల్ పై వచ్చి బతుకుతున్న పిచ్చి కుక్క విజయసాయిరెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని నిధులు అడిగితే శిక్ష పడుతుందనే భయం జగన్, విజయసాయిరెడ్డిలకు ఉందని చెప్పారు. ఏపీలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలకు చేస్తున్న ఖర్చుల వివరాలు కావాలంటే వైసీపీకి మెయిల్ ద్వారా పంపుతామని చెప్పారు. ప్రాధాన్యత లేకుండా ఖర్చు చేస్తున్నారని విమర్శించడం సరికాదని అన్నారు.

kutumba rao
vijayasai reddy
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News