: వందకోట్లతో కొలువుదీరనున్న 'తమిళ తల్లి'


భాషకు తల్లి హోదా ఆపాదించడం మన దక్షిణాదిలోనే కనిపిస్తుందేమో! తెలుగు తల్లి, తమిళ తల్లి.. ఇలా భాషను అమ్మతో పోల్చుకుంటూ మన సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని చాటే ప్రయత్నం చేస్తాం. భాషాభిమానం మెండుగా ద్యోతకమయ్యే తమిళనాడులో అయితే, జాతి పునర్వికాస ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఈ ద్రవిడ భాష ప్రాశస్త్యాన్ని జాతీయస్థాయిలో ప్రచారం చేసుకోవడంలోనూ తమిళతంబీలు ఎల్లప్పుడూ ముందుంటారు. తాజాగా రూ. 100 కోట్లతో 'తమిళ తల్లి' విగ్రహాన్ని నిర్మించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది.

స్వేచ్ఛకు ప్రతిరూపంలా నిలిచే అమెరికాలోని 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' తరహాలో అతి భారీస్థాయిలో ఈ విగ్రహం ఉంటుందని తమిళనాడు సీఎం జయలలిత శాసనసభలో ప్రకటించారు. తమిళజాతి ఉన్నతిని చాటేలా, ఈ విగ్రహాన్ని మధురైలో ప్రతిష్టించనున్నట్టు జయ చెప్పారు. అంతేగాకుండా, తమిళ ప్రతిభావంతులకు ఏటా అవార్డులు అందజేస్తామని కూడా ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News