Tirumala: ఎన్నికల కోడ్‌ ఎఫెక్ట్‌... మే 23 వరకు సిఫారసు లేఖలకు టీటీడీ నో

  • లేఖల దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు
  • దేవాదాయ శాఖ ఆదేశాలు అమల్లోకి
  • ఫలితాలు వచ్చాక మళ్లీ యథాతథంగా దర్శనాలు

ఎన్నికల కోడ్‌ ప్రభావం తిరుమల శ్రీవారి దర్శనాలపైనా పడింది. మే 23వ తేదీన ఫలితాలు ప్రకటించే వరకు సిఫారసు లేఖ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే సిఫారసు లేఖ ఆధారంగా ఈ దర్శనాలు కల్పిస్తుంటారు. అయితే కోడ్‌ అమల్లో ఉన్నందున వీటిని పరిగణనలోకి తీసుకోవద్దని దేవాదాయ శాఖ టీటీడీని ఆదేశించడంతో ఆ మేరకు తిరుమల అధికారులు చర్యలు చేపట్టారు. మే 23వ తేదీన ఫలితాలు ప్రకటించాక ఎప్పటిలాగే సిపారసు లేఖలను పరిగణనలోకి తీసుకుంటారు.

Tirumala
recomandetiona letters
ec code
  • Loading...

More Telugu News