telangana: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

  • రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టిమల్ల గ్రామానికి చెందిన లావణ్య ఆత్మహత్య
  • ఇంటర్ ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం
  • పురుగుల మందు తాగి బలవన్మరణం

తెలంగాణలో ఇంటర్ ఫలితాలలో చోటు చేసుకున్న తప్పిదాల నేపథ్యంలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన లావణ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె... ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి తనువు చాలించింది. ప్రాణపదంగా పెంచుకున్న కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. 

telangana
inter
student
sucide
  • Loading...

More Telugu News