Telangana: కోమటిరెడ్డి ఇంటి నుంచి రాజకీయాల్లోకి మరో నేత!

  • జెడ్పీటీసీ ఎన్నికల్లో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి
  • పేరును ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • ఇటీవల పదవీవిరమణ చేసిన మోహన్ రెడ్డి

తెలంగాణలో కోమటిరెడ్డి కుటుంబం నుంచి మరో నేత అరంగేట్రానికి రంగం సిద్ధమయింది. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశారు.

తాజాగా ఈ కుటుంబం నుంచి వీరి సోదరుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారు. నార్కేట్ పల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఇటీవల పదవీవిరమణ చేశారు.

Telangana
Congress
komati reddy
mohan reddy
  • Loading...

More Telugu News