Kodandaram: అరెస్టులతో ఉద్యమాన్ని ఆపేయగలమనుకోవడం భ్రమ: ప్రొఫెసర్‌ కోదండరామ్‌

  • గత అర్ధరాత్రి నుంచే అరెస్టుల పర్వం
  • ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళన చేసి తీరుతాం
  • ఇంటర్‌ బోర్డు ముట్టడి తప్పదు

అరెస్టులతో ఉద్యమాలను ఆపేయగలమని పాలకులు అనుకోవడం ఒట్టి భ్రమేనని, ప్రభుత్వం పోలీసుల సాయంతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించి తీరుతామని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. ఉద్యమ తీవ్రతను భరించలేని తెలంగాణ ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి నుంచే అరెస్టుల పర్వాన్ని మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు. విపక్ష నాయకులను గృహ నిర్బంధం చేశారని, ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాకు వస్తారనుకునే విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని కోదండరాం ఖండించారు.

Kodandaram
inter board
muttadi
arrests
  • Loading...

More Telugu News