Telangana: ఇంటర్ విద్యార్థిని నవ్యకు సున్నా మార్కులు వేసిన తెలుగు లెక్చరర్ పై చర్యలు
- విధుల నుంచి తొలగించిన శ్రీనారాయణ జూనియర్ కాలేజి
- రూ.5000 జరిమానా చెల్లించిన లెక్చరర్
- 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వేసిన వైనం
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల మంటలు ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థిని నవ్యకు సున్నా మార్కులు వేసిన తెలుగు లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ శ్రీనారాయణ జూనియర్ కాలేజి నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా, ఇంటర్ బోర్డు ఆ అధ్యాపకురాలికి రూ.5000 జరిమానా విధించింది. ఆ జరిమానాను సదరు లెక్చరర్ వెంటనే చెల్లించినట్టు సమాచారం.
పరీక్ష పేపర్ల మూల్యాంకనం స్క్రూటినైజర్ విజయ్ కుమార్ పైనా సస్పెన్షన్ వేటు పడింది. నవ్యకు తెలుగు సబ్జెక్టులో 99 మార్కులకు బదులు సున్నా మార్కులు రావడం ఇంటర్ ఫలితాల అవకతవకలకు పరాకాష్ఠగా చెప్పాలి.