West Godavari District: యువతిని ఇంట్లో నుంచి పిలిచి నరికి చంపిన యువకుడు

  • బంధువుల ఇంట్లో ఉంటున్న మహిద
  • మాట్లాడాలని పిలిచిన యువకులు
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ ఈస్ట్‌లో దారుణం జరిగింది. మహిద(18) అనే యువతిని ముగ్గురు యువకులు అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపేశారు. మృతురాలిని భీమవరం మండలం చెరుకువాడ శివారులోని బేతపూడికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు.

మూడు నెలలుగా మహిద కాజా ఈస్ట్‌లోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఆమెతో మాట్లాడాలని ముగ్గురు యువకులు నేడు  ఇంట్లో నుంచి బయటకు పిలిచారు. వారిలో ఒక యువకుడు ఆమెను కత్తితో నరికి హత్య చేసినట్టు భావిస్తున్నారు. నిందితుడితో పాటు ఒకరు అక్కడి నుంచి పరారవగా, మరొక యువకుడు భయంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలి పడిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

West Godavari District
Yalamanchali
Mahida
Bhimavaram
Kaja East
Murder
  • Loading...

More Telugu News