Amitabh Bachchan: హిజ్రాగా నటించేందుకు ఒప్పుకున్న అమితాబ్ బచ్చన్!

  • హిందీలో 'కాంచన' రీమేక్
  • శరత్ కుమార్ పాత్రలో బిగ్ బీ!
  • దర్శకత్వం వహించనున్న లారెన్స్

తన నట జీవితంలో ఎన్నో కీలకమైన పాత్రలను పోషించిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మరో వైవిధ్యమైన పాత్రను పోషించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. లారెన్స్ హీరోగా, శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కి, తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన 'కాంచన' చిత్రం హిందీలో రీమేక్ కానుండగా, దీనికి 'లక్ష్మీ బాంబ్' అన్న టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే.

 లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. లారెన్స్ పోషించిన పాత్రను అక్షయ్ కుమార్ పోషించనుండగా, ఆయనకు జోడీగా కైరా అద్వానీ నటిస్తోంది. ఇక సినిమాలో ఎంతో కీలకమైన హిజ్రా పాత్రలో నటించేందుకు అమితాబ్ అంగీకరించారని సమాచారం. తెలుగులో ఈ పాత్రను శరత్ కుమార్ పోషించారు. ఇక అమితాబ్ యాక్ట్ చేయడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Amitabh Bachchan
Hizra
Sarat Kumar
Kanchana
  • Loading...

More Telugu News